ప్రేక్షకుల మనసు దోచిన “లైఫ్” డెమో ఫిల్మ్

రోమ్ ప్రొడక్షన్స్ మరియు రోమ్ పిక్చర్స్ సమర్పణలో కొట్టె మల్లికార్జున్ (అర్జున్) హీరోగా, మేఘ హీరోయిన్ గా, నిర్మాతలు రాజు గోపాల్ పొడాల, సుజాత, కళ్ళ అర్జున్ దర్శకత్వంలో మరియు అనిల్, ఆమని, ఎంపీరెడ్డి, జగదీష్ నటులతో కూడిన “లైఫ్” డెమో ఫిల్మ్ ను రోమ్ పిక్చర్స్ సంస్థ యూట్యూబ్ ఛానెల్స్ లో అట్టహాసంగా విడుదల చేయడం జరిగింది. హీరో కొట్టె మల్లికార్జున్ (అర్జున్) మాట్లాడుతూ అన్ని రకాల ఎలివేషన్స్ తో సరికొత్త కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాం.కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజిఫ్ మూవీలో ఏ విధంగా అయితే విజువల్స్ మేకింగ్, కెమెరా పనితనం ఉందో ఆ విధంగా మా లైఫ్ మూవీలో మేకింగ్ విజువల్స్ కూడా అంతే అధ్బుతంగా ఉన్నాయి అని ప్రేక్షకులు ప్రశంసించడం జరిగింది అందుకు మేము ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. సినిమా రంగంలో చిన్న చిన్న పాత్రలతో మూవీలు, సీరియల్స్ లో నటించి, ప్రత్యేక గుర్తింపుతో తొలిసారిగా హీరోగా నటించిన “లైఫ్ డెమో ఫిల్మ్” మూవీకి సంబంధించి నన్ను ఆశీర్వదిస్తూ, మా మూవీకి సహకరించిన పెద్దలు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, ఫిల్మ్ యాక్టర్స్ వెంకట్, తేజ, హీరోయిన్ పూజ, ఇతర నటీనటులకు, యూట్యూబ్, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మంచి కథాంశంతో పాటు, సినిమా నచ్చితే ప్రతి ఒక్కరు ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మరొక్కసారి నిరూపించారు. రాబోయే రోజుల్లో కూడా మంచి సందేశాత్మక చిత్రాలతో పాటు, ప్రత్యేకమైన గుర్తింపుతో సినిమా రంగంలో ప్రత్యేక ముద్ర వేస్తూ, యువ హీరోగా మరిన్ని చిత్రాల్లో నటించి, ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలతో సినిమా రంగంలో ముందుకెళ్తానని తెలియచేశారు. అలాగే నా సినీకళా రంగంతో పాటు, రాజకీయ ప్రయాణంలో కూడా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. మీరు నా మీద చూపించే ప్రేమ, అభిమానం వెలకట్టలేనిది. నేను ఎప్పటికీ మీ ప్రేమకు సదా బానిసను అని హీరో కొట్టె మల్లికార్జున్ పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో నేను చేయబోయే కొత్త సినిమాకు సంబంధించినటువంటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.