కాలుష్యంతో జీవితాలు నాశనం అవుతున్నాయి – ప్రజలు బాధ్యత తీసుకోవాలి

  • జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి

అమలా పురం: పర్యావరణ సమతుల్యం లేకపోవడం వల్ల మానవ మనుగడే ప్రశాంతికి పోయే రోజులు ఉత్పన్నమవుతున్నాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య అన్నారు. అమలాపురంలో స్వచ్ఛ భారత్ లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన స్థానిక శుభ గృహలో ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో మాట్లాడారు. పూర్తిగా పర్యావరణం పాడు అయిపోయింది. దీనిని జనసేన ప్రత్యేకంగా తీసుకుందన్నారు. ఏడాదిలో ప్రతి వ్యక్తి 100 గంటల పాటు పర్యావరణాన్ని కాపాడాలని తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు అన్నారు. కాటన్ పార్కు ను బార్ గా మార్చిన అమలాపురం మున్సిపాలిటీ వ్యవహార శైలిపై సత్య మండిపడ్డారు. ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకు తన శాఖపై కనీస అవగాహన లేదన్నారు. పేర్ని నాని ఏమి మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు అని సత్య ఏద్దేవా చేశారు. విశాఖ దశపల్లా వద్ద వంద అడుగుల రింగురోడ్డు ఎందుకు అంటూ సత్య ప్రశ్నించారు. ఇది ఎవరికి ప్రయోజనం అన్నది తాము తేలుస్తాం అన్నారు. జనసేన నాయకులు డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన అమలాపురంగా తీర్చిదిద్దడమే తన అభిలాష అని ఆయన అన్నారు. పర్యావరణం పై గతంలో కూడా తాను అధికారిగా ఉన్నప్పుడు పలు కార్యక్రమాలు చేపట్టానని శేఖర్ అన్నారు. కేవలం స్వచ్ఛభారత్ కార్యక్రమం కోసమే బొలిశెట్టి వచ్చారని ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని డి ఎం ఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగ సతీష్, నల్లా శ్రీధర్ లింగోలు పండు, కంచిపల్లి అబ్బులు, ఏడిద శ్రీను, పరమట చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.