హోమి బాబా హాస్పిటల్ నియామకాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలి.. జనసేన డిమాండ్

విశాఖ జిల్లా, గాజువాక నియోజకవర్గం నందు గల హోమిబాబా క్యాన్సర్ ఆసుపత్రిలో ఇటీవల వెలువడిన ఉద్యోగ ప్రకటనల్లో స్థానిక యువతకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి తీసుకోవాలి అని, అటెండెంట్ మరియు ట్రేడ్ హెల్పెర్ ఉద్యోగాలను స్థానికులతోనే నియామకాలు చేపట్టాలని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా విడుదల చేసిన జి ఓ నెంబర్ 21 ప్రకారం 75% ఉద్యోగాలు స్థానికులతో భర్తీ చేయాలని అన్నారు, ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అనంతరం పార్టీ నాయకులతో ఆసుపత్రి డైరెక్టర్ ఉమేష్ మహంత్ శెట్టి ని కలిసి మాట్లాడి, స్థానికులకి ప్రస్తుత మరియు భవిష్యత్ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మెమోరాండం అందించారు. కార్యక్రమం చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పీ.వీ.ఎస్.ఎన్ రాజు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గడసాల అప్పారావు, సీనియర్ నాయకులు తిప్పల రమణారెడ్డి, విందుల వెంకటరమణ, జీవీఎంసీ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, దుల్ల రామునాయుడు, ముమ్మిన మురళి, గొన్న రమాదేవి, మేడిశెట్టి విజయ్, విందుల చిరు రాజు, దాసరి త్రినాధ్, దాసరి రమేష్, కోన చిన అప్పారావు, జ్యోతి రెడ్డి, రామ లక్ష్మి, భారతి, సర్వసిద్ధి రాజు, మేడిశెట్టి నరేష్, వసంత్, పిడుగు బంగ్గారాజు, శ్రీనివాస రెడ్డి మరియు స్థానిక 79, 85వ వార్డు జనసేన నాయకులు మరియు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.