‘లవ్ స్టోరీ’ పోస్టర్

యువ సామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘లవ్ స్టోరి’ స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా సమంత తన  ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్టర్‌ను షేర్ చేసిన ఆమె ఎప్పటికీ చైతన్య సంతోషంగా ఉండాలని విష్ చేశారు.

“Always living life on your own terms @chay_akkineni. Wishing you only happiness always and forever (sic).” అని ఆమె రాసుకొచ్చారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ పోస్టర్ లో బనీను, లుంగీ వేసుకుని పక్కింటబ్బాయి గెటప్‌లో నాగచైతన్య ఆకట్టుకున్నాడు.

దర్శకుడు శేఖర్ కమ్ముల విషెస్‌ చెబుతూ.. ”కొన్ని స్నేహాలు ఎంతో ఆనందాన్నిస్తాయి. చైతూతో అసోసియేషన్ అలాంటి సంతోషాన్నే ఇస్తుంది. హ్యాపీ బర్త్ డే చైతన్య” అని ట్వీట్ చేశారు.