వీరజవాన్ సాయితేజకు శ్రద్ధాంజలి ఘటించిన మదనపల్లి జనసేన

భరతమాత ముద్దుబిడ్డ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశానికి, దేశ రక్షణకు తీరనిలోటు.

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తెలుగుతల్లి కన్నబిడ్డ సాయితేజ తో పాటూ అసువులు బాసిన సైనికులందరికి జనసేన పార్టీ తరుపున శిరస్సు వంచి కన్నీటితో శ్రద్దాంజలి ఘటించారు మదనపల్లి జనసేన. వీర జవాన్ సాయితేజకు నివాళి అర్పించిన వారిలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, వీర మహిళ ప్రియ, మదనపల్లి జనసేన నాయకులు తులసి శ్రీనివాస్, రమణారెడ్డి, వినయ్ కుమార్, రామచంద్ర రెడ్డి ఉన్నారు.