లోకం మాధవి ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం

విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రామ తీర్థాలలో మహా రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. జనసైనికులు, వీరమహిళలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివ పూజలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మాధవి లోకం నిర్వహించిన పూజకు ఎంతో మంత్రముగ్ధులయ్యారు, పూజానంతరం 40,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు మాట్లాడుతూ శ్రీ లోకం మాధవి ఎంతో ప్రతిష్టంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాని, దీనివలన జనసేన పార్టీ ప్రజలలో ఒక ఆలోచనకు గురి చేస్తుందని ప్రశంసించారు.