మహాత్మునికి పోతిన మహేష్ ఘన నివాళి

విజయవాడ, పశ్చిమ నియోజకవర్గం, మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించిన పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ అహింస, సత్యం, శాంతి మార్గాలను చూపిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని వారు సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరు ప్రయాణిస్తే విజయాలు సాధించడం చాలా సులువని, 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వారిని అహింసా మార్గంలో దేశం నుంచి పారద్రోలి భరతమాతకు భారతదేశానికి స్వేచ్ఛ వాయువులు ప్రసాదించారంటే వారు పాటించిన అహింస మార్గమే అందుకు కారణమని అటువంటి గొప్ప మార్గాన్ని నేడు ప్రపంచం మొత్తం పాటిస్తున్నారని, అదేవిధంగా సత్యానికి చాలా బలం ఉంటుందని అది అవినీతిపరులను అక్రమార్కులను ప్రశ్నిస్తుందని సత్యాన్ని ఆచరించే వ్యక్తి ఎటువంటి వ్యక్తినైనా ఎదిరిస్తారని అది సత్యం తాలూకా గొప్పతనం అని ఆచరణలో చూపిన వ్యక్తి గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసరావు, సింగనం శెట్టి రాము మరియు తవ్వ మారుతి నూనె సోమశేఖర్ సావింకర్ నరేష్ బావిశెట్టి శ్రీనివాస్ పిల్ల శ్రీకాంత్ బంగారు నూకరాజు కిలాని రాము యాదవ్ రావుల అఖిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.