క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: వడ్రాణం

పొన్నూరు‌ నియోజకవర్గం, పెదకాకాని మండలం, కొప్పురావూరు గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయు నిమిత్తం కొప్పురావూరు గ్రామ జనసేన ఆధ్వర్యంలో సభ నిర్వహించటం జరిగినది. ఈ‌ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వీరెళ్ల వెంకటేశ్వరరావు హాజరైనారు. కార్యక్రమంలోభాగంగా కార్యకర్తలకు మార్కండేయ బాబు దిశా నిర్దేసం చేసరు. అనంతరం గ్రామ మాజీ ఉప సర్పంచ్ పరకండ్ల శంకర రావు (పండు మేస్త్రి), పరకండ్ల సుధాకర్, పార్టీలో చేరినారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాలిశెట్టి సహదేవరావు, మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పరకండ్ల శేషయ్య, అడపాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు విన్నకోట సుబ్రహ్మణ్యం పల్లెంపాటి రమేష్, కార్యదర్శి అనిల్, చేబ్రోలు మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు నారిశెట్ఠి కృష్ణయ్య, సీనియర్ నాయకులు తడవర్తి అప్పారావు, గ్రామ జనసేన అధ్యక్షుడు సోమిశెట్టి పాండు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.