ఛలో తాడేపల్లిగూడెం విజయవంతం చేయండి

ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం, ప్రత్తిపాడు గ్రామం, ఆటోనగర్ నందు బుధవారం “తెలుగు జన విజయకేతనం జెండా” పేరుతో జనసేన మరియు టిడిపి ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరు వెళ్లి విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరికీ ఉంది. కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో జనసైనికులు కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా, అవినీతి, అరాచక, రాక్షస పాలనకు చరమగీతం పాడే విధంగా కలిసి సాగుదాం విజయాన్ని లిఖిద్దాం, వ్యూహం మన అధినేత పవన్ కళ్యాణ్ చూసుకుంటారు, ఉమ్మడి అభ్యర్థులను గెలిపించే బాధ్యత మనందరం తీసుకుందాము, కావున “ఛలో తాడేపల్లిగూడెం” భారీ బహిరంగ సభకు కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసైనికులు వీరమహిళలు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అంటూ నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.