అంబటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బఫూన్ అని విమర్శించిన మంత్రి అంబటి రాంబాబుపై రెడ్డి అప్పల నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈరోజు సంబరాలు రాంబాబు అనే బఫూన్ మాట్లాడుతున్నాడు. రోజురోజుకు పవన్ కళ్యాణ్ ని తిట్టి వెలుగులోకి రావాలనే తపనతో ఈరోజు సంబరాల రాంబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నాడు. ఈరోజు నీ సొంత నియోజకవర్గంలోనే ఆరోపణలు చేస్తున్నారు. నీ నియోజకవర్గంలో ఎవరైనా మరణించినటువంటి వారికి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాటిలో పర్సంటేజ్ అడుగుతున్నావని, దాంతోపాటు మీ సొంత పార్టీ ఎంపీటీసీలే నిన్ను విమర్శిస్తున్నారు. ఈరోజు పేపర్లో చూస్తే ఈ సంబరాలు రాంబాబు కింద పని చేసినటువంటి ప్రజా నాయకులు స్థానిక నాయకులు గుర్తు రావట్లేదని అని చెప్పేసి ఎక్కడైనా సంబరాలు జరిగితే రికార్డింగ్ డాన్స్ చేసుకుంటున్నాడని, నీ నియోజకవర్గ ప్రజలే నిన్ను తిట్టిపోస్తున్నారు. ఇప్పటికైనా గాని ఒక మంత్రిగా ఉండి ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన అటువంటి మాటలు మాట్లాడాలని నువ్వు చేయవలసిన పనులు చేయాలని హెచ్చరించారు. అంతేకాకుండా ముందు నీ శాఖ మీద అవగాహన పెంచుకో ? అంతేగాని జగన్ రెడ్డి మెప్పు కోసం పవన్ కళ్యాణ్ ని విమర్శించాలనుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలు పిచ్చివాళ్ళు కాదని ఆ కృష్ణాజిల్లా మొత్తానికి మీ చరిత్ర ఏంటో తెలుసు. గత 30 సంవత్సరాలుగా నీ పరిస్థితి ఏంటో అందరికి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి దయవల్ల ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి నీది కాదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఇకనుంచైనా నీ బుద్ధిని విధానాన్ని ఆలోచనను మార్చుకోవాలని ఖండిస్తున్నాం. లేని పక్షంలో జనసైనికులు నీకు చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాను. ఈరోజు మీ వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది. ఎవర్ని పట్టించుకునే పరిస్థితి లేదు. హౌసింగ్ లోన్స్ కి ఇచ్చే పరిస్థితి లేదు. వైద్యం అందించే పరిస్థితి లేదు. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం అని చెప్పినటువంటి మీరు కనీసం కాపర్ డ్యాం కూడా నిర్మాణం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నీ శాఖ మీద కనీసం నీకు 10%, 15% కూడా అవగాహన లేదు. అవి పెంచుకొని ప్రజాసేవ చేస్తే వాళ్ళు ఏమైనా కరుణించి మళ్ళి నువ్వు గెలిచే అవకాశం ఉంటుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ ని తక్కువ చేసి మాట్లాడితే జనసైనికులు నీ తాటతీసి మూలకు కూర్చోబెడతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటినుంచి అయినా ఈ యొక్క పిచ్చివాగుడు మాని మీ నోటిని కట్టడి చేయాలని జనసేన పార్టీ నుండి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా హెచ్చరిస్తున్నాం అని అన్నారు.