నాగబాబు గారి పర్యటనను విజయవంతం చేయండి: గంజికుంట రామకృష్ణ

తాడిపత్రి: కొణిదెల నాగబాబు అనంతపురం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జనసేన పార్టీ నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు జనవరి 21, 22వ తేదీల్లో అనంతపురము జిల్లాలో పర్యటించరున్నారు. జనసేన రాష్ట్ర నాయకులు నాగబాబు 21న శనివారం కర్నూలు జిల్లా పర్యటన ముగించుకొని సాయంత్రం 5:00 గంటలకు పామిడి కల్లూరు హైవే వద్ద శ్రీ కొణిదెల నాగబాబు గారు చేరుకుంటారు. అక్కడ నుండి ఆయనకు శింగనమల నియోజక వర్గ జనసైనికులు, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారని.. అలాగే అనంతపురం శివారులోని తపోవనం సర్కిల్లో మరి స్వాగత ఏర్పాట్లు చేసినట్లు అదేవిధంగా భారీ బైక్ ర్యాలీ ఉంటుందని వారు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక అలెగ్జాండర్ హోటల్ నుండి ఐరన్ బ్రిడ్జ్, పాతూరు గాంధీ రోడ్డు, చెరువుకట్ట మీదుగా కలెక్టరేట్ వరకు గుంతలు పడిన రహదారులకు మరమ్మత్తులు చేసేందుకు స్వచ్ఛంద శ్రమదాన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం 10:30 గంటలకు అలెగ్జాండర్ హోటల్లో ఏర్పాటు చేసిన వీరమహిళల సమావేశంలోనూ మధ్యాహ్నం 2:30 గంటలకు కార్యకర్తల సమావేశంలో నాగబాబు గారు పాల్గొని పార్టీ విధివిధానాలను, క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలను కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపేందుకు అవలంబించాల్సిన అంశాలను వివరించనున్నట్లు పేర్కొన్నారు. శింగనమల నియోజక వర్గ జనసైనికులు, కార్యకథలు, వీరమహిళలు పెద్దఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని నాగబాబు గారి పర్యటననువిజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.