శౌర్య దివస్ ను విజయవంతం చేయండి!:

  • శౌర్య దివస్ గోడ ప్రతుల ఆవిష్కరణ

భైంసా: బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో 205వ భీమా కోరేగావ్ ఉద్యమ స్ఫూర్తితో భైంసా పట్టణంలో జనవరి, 01 తేదీన నిర్వహించబోయే శౌర్య దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు అమూల్, సభ అధ్యక్షుడు సాహెబ్ రావు, కామ్లే, బీసీ సంక్షేమ సంఘం నాయకులు సుంకెట మహేష్ బాబు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్ఫూర్తిగా తీసుకొని యువత ఉద్దేశం నిర్దేశం చేసే విధంగా ప్రముఖ ప్రొఫెసర్ క్షీరసాగర్ సుభాష్, ప్రొఫెసర్ జేటి జాదవ్ ఉపన్యాసంతో దిశా నిర్దేశం చేసే ఈ వేదిక ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడానికి ప్రతి బహుజన బిడ్డ సిద్ధంగా ఉండాలని, జనవరి 1తేదీన భైంసా పట్టణంలోని ఎల్బీ కన్వెన్షన్ హాల్లో జరుగుతుందని, నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతినిధుల హాజరవుతున్నారని ముధోల్ నియోజకవర్గంలోని యువతీ-యువకులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో బాబా సాహెబ్, మైనార్టీ నాయకులు అంజద్ షేక్, ఐక్యవేదిక నాయకులు విలాస్, దిలీప్, రాష్ట్ర పాల్, రామ్నాథ్ నాయక్, చందు బాలే రావు, సచిన్ తదితరులు పాల్గొన్నారు.