రాజంపేట జనసేన ఆద్వర్యంలో వంగవీటికి ఘన నివాళులు

రాజంపేట: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన రంగా 34వ వర్ధంతి సందర్బంగా అన్నమయ్య జిల్లా కేంద్రం, రాయచోటి అసంబ్లీ ఇంచార్జ్ షేక్ హసన్ భాష ఆదేశాల మేరకు, జిల్లా కార్యక్రమాల సభ్యులు షేక్ రియాజ్ నేతృత్వంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు!, ఈ సందర్భంగా జనసేన నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు లేని లోటు ఈ రాష్ట్రా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది, అలాంటి ప్రజా నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఆదర్శనీయం, ఆయన స్ఫూర్తితో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మనమందరం రంగా గారికి ఇచ్చే ఘననివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి చిరంజీవి యువత అధ్యక్షుడు జయరామ్, జనసేన పార్టీ యువ నాయకులు షేక్ సలీమ్, బలిజసంగం నాయకుడు సుబ్బరామయ్య, జనసైనికులు అర్ఫాద్, ముశిరహ్మద్, మసూద్, ఫైజాన్, జుబేర్, ఎలియన్ తదితరులు పాల్గొన్నారు.