#GoodMorningCMSir కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: డా. యుగంధర్

*గోతుల మధ్య రోడ్లను వెతుక్కోవాల్సి వస్తోంది

*జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన GoodMorningCMSir కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ నియోజకవర్గం లోని ఆరు మండలాల అధ్యక్షులు, కమిటి సభ్యులు, వీర మహిళలు, జనసైనికులు, సీనియర్ నాయకులు, నియోజకవర్గం సమన్వయ కర్తలకు పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రం లో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందని, రోడ్లు ఛిద్రమై విచిత్రంగా తయారైందని, ఈ రోడ్ల మీద ప్రయాణం ప్రజలకు ప్రాణ సంకటంగా మారిందని మదన పోయారు. నిద్ర పోతున్న వారిని మేల్కొలపడం అవుతుంది కాని నిద్ర పోతున్నట్లు నటించే వారిని లేపడం కష్టమని తెలిపారు. మన షియం పరిస్థితి అచ్చం ఇలాగే ఉందని విమర్శించారు. ఇంపార్టెంట్ మినిస్టర్ రోడ్లను బాగుచేసే ఆలోచనలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ముఖ్యమంత్రిని మేల్కొలిపి గుడ్ మార్నింగ్ చెప్పి లోపాలని, ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు వేసే విధంగా చైతన్యం తీసుకురావాలని తెలిపారు. 15, 16, 17 అనగా రేపటి నుండి మూడు రోజుల పాటు జరగనున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ, ఒక నిమిషం ఛిద్రమైన రోడ్డు వద్ద నిలబడి GoodMorningCMSir అని టాగ్ చేసి పేస్ బుక్, ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయాలనీ తెలిపారు. వైసీపీ అసమర్ధ పాలనను ఎండగట్టాలని, ప్రజలకు సవివిరంగా తెలియజేయాలని చెప్పారు. గతంలో కూడా అడుగుకో గుంత, గజానికో గొయ్యి కార్యక్రమం విజయవంతం అయిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు సాయి కృష్ణ, విజయ్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, ప్రధాన కార్యదర్శి నరసింహ, అమర్నాధ్, కృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.