జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: పేడాడ రామ్మోహన్

ఆముదాలవలస: జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరగబోయే జనసేన 10వ ఆవిర్భావ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆమదాలవలస నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలకు పేడాడ రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నారు దాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, రానున్న రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.