యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కనపర్తి మనోజ్ కుమార్

  • 2024లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కచ్చితంగా అవుతారు

కొండేపి: జనవరి 12న శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో జరుగనున్న యువశక్తి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ పిలుపునిచ్చారు, మనోజ్ కుమార్ మాట్లాడుతూ యువత యొక్క భవిష్యత్తు, అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగం, యువతకు దిశా నిర్దేశం ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలోనే యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, యువత గురించి ఆలోచిస్తున్న ఏకైక రాజకీయ పార్టీ జనసేన పార్టీ మాత్రమే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కేవలం జనసేన ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు.