పేర్ని నాని, మంత్రి రోజా లకు సవాల్ విసిరిన మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గము జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి తన సందేశంలో, మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి రోజమ్మ పై చాలా ఘాటుగా మాట్లాడుతూ, వారిద్దరిని స్థాయి దిగజారి మాట్లాడవద్దని, గొప్ప బాధ్యతలు వెలగబెడుతున్న తమరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, సభ్యత సంస్కారంతోపాటు ఉన్నత విలువలు పాటిస్తూ అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా గౌరవ మర్యాదలు పాటించాలని, ఎంతో హుందాగా వ్యవహరించాలని, చేతనైతే ప్రభుత్వం పరిపాలనలో లోపాలను సరిదిద్దుకుంటూ, గొప్ప పరిపాలన అందించాలని, అంతేగాని, గొప్ప మానవతా విలువలు కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప స్థాయిగల నాయకుడను విమర్శించే అర్హత మీకు ఎక్కడిదని! మీలాంటి వారికి నా స్థాయి చాలని, రండి ఎక్కడైనా డిబేట్లో కూర్చుని మాట్లాడదాం! దమ్ము ధైర్యం ఉంటే నా చాలెంజ్ ని స్వీకరించాలని మాకినీడి శేషు కుమారి చాలా ఘాటుగా సవాల్ విసిరారు. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా సొంతతల్లిని, సొంత చెల్లిని, కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేని వారు మీ ముఖ్యమంత్రి అని, తన రాజకీయ అవసరాలకు అయినవారిని వాడుకుని వదిలేసే మనిషి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని, మీ ముఖ్యమంత్రి లాగా, అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదని తెలుసుకోవాలని, అన్న చిరంజీవిని ఏనాడు మోసం చేయని గొప్పమనిషిగా, అన్న ఆశయాలను నిలబెట్టడం కోసం మరో అర్జునుడిగా పద్మవ్యూహంలో నిలబడి ఒంటరిగా పోరాడుతూ, ప్రజల హృదయాలను, అందరి సామాజికవర్గాల ప్రజల మనసు గెలుచుకుంటూ విజయం వైపు తుఫాను వేగంతో పయనిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ వారి జగన్నాథ రథచక్రాలను చూసి, మీకు గుండెల్లో రైళ్లు పరిగెత్తే రోజు దగ్గరలో ఉన్నదని, ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని, ప్రజాప్రతినిధులుగా ఎంతో జాగ్రత్తతో మాట్లాడి, ఎదుట ఉన్న పార్టీల ప్రతిపక్ష సభ్యులతో మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ మాకినీడి శేషు కుమారి తన సందేశం ద్వారా మాజీ మంత్రి పేర్ని నానివారికి, మంత్రి రోజాలకు తెలియజేశారు.