జనసైనికుడు తుమ్మలపల్లి కుటుంబానికి అండగా మాకినీడి!!

పిఠాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యకర్త తుమ్మలపల్లి సత్యనారాయణ (చిన్ని) కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పిఠాపురం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషు కుమారి భరోసా ఇచ్చారు . కుమారపురం గ్రామానికి చెందిన తుమ్మల పల్లి సత్యనారాయణ (చిన్ని) కుటుంబాన్ని గురువారం ఆమె పరామర్శించి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందినటువంటి పార్టీ ఆవిర్భావము నుంచి పార్టీకి అహర్నిశలు కష్టపడి అనేక సేవలు అందించిన మన తుమ్మలపల్లి చిన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందనీ ఆయన మరణానికి చింతిస్తూ ఆయన కుటుంబానికి అండగా తాను, జనసైనికులు ఉంటారని అన్నారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జిగా చిన్న కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో చిన్నా యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం 5000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చిన్న కుటుంబానికి ఇంటి ఆడపడుచులా అండగా ఉంటూ మంచి చెడుల్లో భాగస్వామ్యం పంచుకుంటానని శేషు కుమారి తెలిపారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నా కుటుంబానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటికాయల సింగయ్య (శివ), ముద్రగడ శ్రీను, తుమ్మలపల్లి రవి, సాధనాల రాజా, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.