జ్యోతుల వెంకటసుబ్రమణ్యంను పరామర్శించిన మాకినీడి దంపతులు

పిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలు పట్నంలో జనసేన క్రియాశీలక కార్యకర్త జ్యోతుల లక్ష్మణరావు కుమారుడు జ్యోతుల వెంకటసుబ్రమణ్యం భవన నిర్మాణ కార్మికుడు. రోజువారీ కూలీ పని నిమిత్తం పిఠాపురం మండలం జల్లూరు వద్ద ద్విచక్ర వాహనం ప్రమాదంలో గాయపడి, ముక్కుకు ఆపరేషన్ జరిగింది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు వారి హస్బెండ్ మాకినీడి వీరప్రసాద్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు పట్టణ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, గొల్లప్రోలు మండలం మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ, గుండ్రపు హరీష్, కాటపు శ్రీరామ్, నారపురెడ్డి రాజ, కారపురెడ్డి ఏసు, కరెడ్ల సత్తిబాబు, తదితరుల ఉన్నారు.