ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులుగా మలగా రమేష్

ఒంగోలు, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులుగా మలగా రమేష్ ను నియమించగా… పార్టీకి చేసిన సేవలను గుర్తించి, తనను ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి, మరియు ఆయనకు పూర్తిగా సహకరించిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాని తెలిపారు. అలానే అందరినీ కలుపుకుంటూ వెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నానని తెలిపారు.