జనసేన MPTC లను సత్కరించిన మామిడికుదురు జనసైనికులు

మామిడికుదురు మండలం లోని పాశర్లపూడిలంక గ్రామంలో నూతనంగా గెలుపొందిన mptc లకు జనసేన పార్టీ తరుపున సన్మానాలు నిర్వహించారు. ఎంపీటీసీ లుగా పెదపట్నం గ్రామం నుండి కొమ్ముల జంగమయ్య, పాశర్లపూడిలంక గ్రామం నుండి చెరుకూరి పార్వతి దేవి, దొడ్డవరం గ్రామం నుండి వాసంశెట్టి రమణ మరియు పెదపట్నం గ్రామం నుండి పద్మావతి గార్లకు సన్మానం చేశారు. అనంతరం విజయోత్సవసభ నిర్వహించారు.


పాశర్లపూడిలంక గ్రామ శాఖ అధ్యక్షుడు బొరుసు దుర్గబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిలుగా మామిడికుదురు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అడబాల తాతకాపు గారు, జాలెం శ్రీనివాసరాజా హాజరయ్యారు పాశర్లపూడి గ్రామశాఖ వేగి పండు, పెదపట్నం గ్రామశాఖ బల్ల సతీష్, బి.దొడ్డవరం గ్రామశాఖ జవ్వాది నాని, ఆదుర్రు గ్రామశాఖ శేఖర్, పార్టీ నాయకులు తెలగారెడ్డి యేసు, చిట్టాల రాంబాబు, బొంతు గాంధీ, మట్టా సత్తిబాబు, మంద గాంధీ, తుండురి బుజ్జి, మేడేపల్లి చిన్న, పెదపట్నం సర్పంచ్ గుబ్బల దుర్గాదేవి, కోలా సతీష్ తదితరులు పాల్గొన్నారు.