మన ఊరు మన ఆట – సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి రూరల్ మండలం. భృగుబండ గ్రామంలో జనసేన, తెలుగుదేశం ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట కార్యక్రమంలో భగంగా వీరమహిళలు, తెలుగింటి ఆడపడుచులకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీల కార్యక్రమం భృగుబండ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు విచ్చేయడం జరిగినది. సంక్రాంతి పండగను పురస్కరించుకొని జనసేన, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వీరమహిళలు, తెలుగింటి ఆడపడుచులకు న్యాయ నిర్ణీతలు ఎంపిక చేసిన విజేతలుగా ఎన్నికైన మహిళలకు నగదును సత్తెనపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు గారి చేతులమీదుగా బహుమతులను అందజేశారు. పోటీలలో పాల్గొన్న మిగతా మహిళలకు ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భృగుబండ జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పాల్గొన్నారు.