ప్రమాదవశాత్తూ గాయపడిన క్రియాశీలక సభ్యుని పరామర్శించిన చిల్లపల్లి

మంగళగిరి మండలం, కాజా గ్రామానికి చెందిన క్రియాశీలక సభ్యుడు రాగం దనుమావంతరావు తాపీ పని కూలి పనికి వెళ్ళిన చోట ప్రమాదవశాత్తూ పరంజా పైనుంచి కింద పడి గాయపడటం జరిగింది. ఈ విషయం జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు దృష్టికి రాగా బుధవారం కాజా గ్రామంలోని దనుమావంతరావు ఇంటికి వెళ్లి పరామర్శించి, జనసేన పార్టీ మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి సహాయం కావలసిన జనసేన పార్టీ తరఫున మా వంతు సహాయసహారాలు చేస్తామని భరోసా ఇచ్చి ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి అప్పికట్ల శివబాబు, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు కాపురౌతూ సుందరయ్య, కాజగ్రామ సీనియర్ నాయకులు కంకణాల శంకర్, రాఘవయ్య, మంగళగిరి మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, కాజా గ్రామ జన సైనికులు, మంగళగిరి మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.