మంగళగిరి జనసేన పార్టీలో భారీ చేరికలు

జనసేన పార్టీలో చేరిన మంగళగిరి, పార్క్ రోడ్డు యువత
మంగళగిరి: గురువారం రాత్రి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో చిట్టెం అవినాష్ ద్వారా మంగళగిరి పార్క్ రోడ్డుకి చెందిన యువత మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి యువత అందరూ దాదాపు 20 మంది పార్టీలో చేరటం జరిగిందని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసి పవన్ కళ్యాణ్ గారిని రానున్న ఎన్నికల్లో సీఎం అయ్యేవిధంగా మనందరం కలిసికట్టుగా పని చేయాలని కోరారు.దాసరి శ్రవణ్ కుమార్, మీసాల శ్రీనివాస్, గూడూరి కిషోర్ బాబు, పగిడి లక్ష్మణ్ కుమార్, గుంటకాని మహేష్, పగిడి పవన్, వినుకొండ రాంబాబు, జంగం గణేష్, లోచర్ల సాగర్ బాబు, షేక్ సాయి, నూకబత్తిన కార్తీక్ బాబు, దొండబత్తుల వెంకటేష్, బుర్రి రాజ శేఖర్, నూకతోటి బాల కృష్ణ, అద్దెంకి శ్యామ్ బాబు, ఉప్పు యశ్వంత్, పంచమర్తి చంద్ర సాయి కిరణ్, కొమ్మా నంద గోపాల్ తదితరులు జనసేన పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, ఎంటిఎంసీ నగర అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె ఎస్ ఆర్), మంగళగిరి నియోజకవర్గ యూత్ నాయకులు చిట్టెం అవినాష్, ఎంటిఎంసీ సంయుక్త కార్యదర్శులు కొండపాటూరి చంద్రశేఖర్, కట్టెపోగు సురేష్, సీనియర్ నాయకులు కొండలరావు, యర్రబాలెం గ్రామ అధ్యక్షులు సుందరయ్య, మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, మంగళగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్ తదితరులు పాల్గొన్నారు.