మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కమిటీ సమావేశం

మంగళగిరి నియోజకవర్గం: జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు ఆధ్వర్యంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరవటం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ★ ఎంటిఎంసీ కమిటీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ, ★ ఎంటిఎంసీ జనసేన పార్టీ డివిజన్ కమిటీలు ఏర్పాటు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భావమైనప్పుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే, కానీ ఇప్పుడు వందల మంది నాయకులతో లక్షలాది కార్యకర్తలు ఉన్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలలో దాదాపుగా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి దిశగా ఎంటిఎంసీ పరిధిలో ఉన్న డివిజన్ కమిటీలు కూడా పూర్తి చేయాలని ఎంటిఎంసీ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం ఇచ్చారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల కడవు మాత్రమే ఉందని, ఈ లోపు గ్రామ, డివిజన్, బూత్ కమిటీలు అతి త్వరలో ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. మంగళగిరిలో రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ నిలబడుతుందని, నియోజవర్గ స్థాయిలో పార్టీ గెలుపు కోసం కృషి చేసి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవిధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. తాడేపల్లిలో నివాసం ఉంటున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటికీ కార్పొరేషన్ ఎన్నికలు జరిపించకపోగా 175 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయమని సవాల్ విసురుతుంది. ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలిచే సత్తా ఉంటే మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జనసేన పార్టీ తరఫునుంచి మేము సిద్ధంగా ఉన్నామని, ఎన్నికలు జరిపించమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు శెట్టి రామకృష్ణ, షేక్ కైరుల్లా, ఎంటిఎంసీ కమిటీ సభ్యులు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (జె.ఎస్.ఆర్), మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, జనసేన పార్టీ ఈమని-1 ఎం.పీ.టీ.సీ – దుగ్గిరాల మండల వైస్ ఎం.పీ.పీ పసుపులేటి సాయి చైతన్య, మంగళగిరి నియోజకవర్గ కాపు సంక్షేమ సేన సంఘం అధ్యక్షులు తిరుమల శెట్టి కొండలరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.