రైతు దినోత్సవ వేడుకలలో మంత్రాలయం జనసేన

  • మంత్రాలయం జనసేన పార్టీలో చేరికలు

మంత్రాలయం నియోజకవర్గం, కోసిగి మండలం, దొడ్డి బెళగల్ గ్రామంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతు యొక్క ప్రాముఖ్యతను, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజలకు, జన సైనికులకు వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ జనసేన పార్టీని ఆదరించాలని కోరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల పట్ల, ప్రజల పట్ల ఆయనకు ఉన్న విధానాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు పొంత నరసింహులు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది.