కంచడం సహకార బ్యాంకులో భారీ అవకతవకలు: ఎస్ వి బాబు

పెడన, బంటుమిల్లి మండలం, కంచడం గ్రామంలో సహకార సంఘ బ్యాంకులో రైతులకు తెలియకుండానే కౌలు కార్డులపై లోన్ తీసుకున్న స్థానిక వైసీపీ నాయకులు. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వైసిపి, మంత్రి జోగి రమేష్ ఈ విషయంపై సమాధానం చెప్పాలి. నిలదీసిన రైతులపై మంత్రి పేరు చెబుతూ బెదిరింపులకు దిగిన స్థానిక వైసిపి నాయకులు. కంచడం పిఏసిఎస్ సహకార బ్యాంకులో 400 బస్తాల పొటాష్ ను అమ్మేసుకున్న బ్యాంకు బోర్డు సభ్యులు. జనరల్ బాడి మీటింగ్ లో బ్యాంకు చైర్ పర్సన్, సెక్రటరీలను నిలదీసిన రైతులు. 400 పొటాష్ బస్తాలు అమ్ముకుని బ్యాంకుకు జమ చేయకపోవడంపై ఆగ్రహం. 10 రోజుల్లో కడతామంటూ పోంతనలేని సమాధానాలు చెప్పిన సెక్రటరీ. రైతులపైనే ఎదురు తిరిగిన సెక్రటరీ. రైతులు, బ్యాంకు సెక్రటరీ మధ్య వాగ్వివాదం. డబ్బు చెల్లించకపోతే కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామన్న రైతులు. పిఏసిఎస్ సహకార బ్యాంకు చైర్మన్ కు, కంచడం సర్పంచుకు ఈ అవకతవకల్లో ప్రధాన పాత్ర ఉన్నట్టు స్థానికుల ద్వారా వినికిడి. వీరిరువురు వైసిపి నాయకులు కావడంతో స్థానిక రైతులు ఎవరూ మాట్లాడకుండా ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి నిజానిజాలు బయటపెట్టి రైతులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. లేనియెడల రైతులతో కలిసి ఎలాంటి పోరాటకానికైనా జనసేన సంసిద్ధమని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.