గూడూరు జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గణిత దినోత్సవం

గూడూరు, బుధవారం గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూలులో జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ గణిత శాస్త్ర మేధావిగా శ్రీనివాస్ రామానుజన్ చేసిన సేవలను ఆయన సాధించిన విజయాలను తెలియచేయడం జరిగింది. అనంతరం శ్రీనివాస్ రామనుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివ, సాయి, వసంత్, ఉపాధ్యాయులు రామ్మోహన్, కీర్తి, శ్రీను మరియు మస్తాన్ పాల్గొన్నారు.