ముస్లిం సోదరులకు అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలి: నేరేళ్ళ సురేష్

గుంటూరు, ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ నెలరోజుల పాటూ భక్తిశ్రద్ధలతో కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తూ దైవ చింతనతో గడిపే ముస్లిం సోదరులకు ఆ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ సమయాన ముస్లింలు తమ సంపాదనలో కొంత పేదలకు ఖర్చుచేస్తారన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు అందరికీ నేరేళ్ళ సురేష్ శుభాకాంక్షలు తెలిపారు.