జేఎస్పి రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మే డే వేడుకలు

గుంటూరు, నల్లచెరువు, మే డే సందర్భంగా గుంటూరు నల్లచెరువులో ఆదివారం జేఎస్పి రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు 100 మందికి రేడియం జాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ మన దేశంలో మే డే అధికారంగా ప్రకటించి దాదాపు 100 ఏళ్లు అయినా కార్మికుల జీవితాల్లో ఎటువంటి మార్పూ లేదని, వారు చేస్తున్న అవిరళ కృషిని ఈ ప్రభుత్వాలు గుర్తించటం లేదని, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక శాఖను మరింత బలోపేతం చేసి కార్మికులకు పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎందరో కార్మికుల త్యాగాలతో ఏర్పడ్డ మే డే ను కార్మికుల పండుగగా మార్చేంత వరకూ జనసేన పోరాటం చేస్తుందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న కార్మిక నాయకులు సోమి ఉదయ్ కుమార్, అన్నదాసు వెంకట సుబ్బారావు లు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. తదంతరం మాట్లాడిన రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ కోవిడ్ సమయంలో పారిశుధ్య కార్మికులు చేసిన వెలకట్టలేని సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్, గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, నాయకులు అన్నదాసు వెంకట సుబ్బారావు, సోమి ఉదయ్ కుమార్, బండారు రవీంద్ర, పుల్లంశెట్టి ఉదయ్, బొడ్డుపల్లి రాధాకృష్ణ, సూదా నాగరాజు, మిద్దె నాగరాజు, పాములూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.