క్రియాశీలక సభ్యత్వాల నమోదుకోసం సమావేశం

అనంతపురంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ శుక్రవారం క్రియాశీలక సభ్యత్వంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియసీలక సభ్యత్వాలు ఎక్కువ సంఖ్యలో జరిగే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఇక మూడు రోజుల సమయం ఉన్నందున గ్రామస్థాయిలోని పవన్ కళ్యాణ్ అభిమాని ప్రతి జనసేన కార్యకర్త ఒక్కరూ సభ్యత్వం తీసుకునే విధంగా మండల అధ్యక్షులు కృషి చేయాలని తెలియజేశారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి పార్టీలో ప్రముఖ స్థానం ఉంటుంది అని వివరించడం జరిగింది. ఇది మన పార్టీ అని భుజాన వేసుకొని ఆశయ బలంతో త్రికర్ణ శుద్ధితో పనిచేసే కార్యకర్తలే జనసేన బలం అని పవన్ కళ్యాణ్ ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు. జనసేన కోసం డబ్బు లేకుండా ఏమి ఆశించకుండా పనిచేసే వారికి అనుకోని ప్రమాద సంఘటనలు జరిగితే హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయలు ఒకవేళ దురదృష్ట పరిస్థితులలో మరణించినయెడల 5 లక్షలు వారి కుటుంబ సభ్యులకు భరోసాగా ఉండాలని ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొని వచ్చారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీ చేయలేదు అని తెలియజేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం మొన్ననే కోటి రూపాయలు విరాళంగా పవన్ కళ్యాణ్ ఇవ్వటం జరిగింది. కార్యకర్తల సంక్షేమం కోసం ఏ రాజకీయ పార్టీ అధినేత ఈ విధంగా చేసిన దాఖలాలు లేవు. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్ , మండల అధ్యక్షులు జయ కృష్ణ, జాకీర్ హుస్సేన్, కాంతరాజు, ఆంజనేయులు వీర మహిళలు షేక్ తార, మమత జనసేన నాయకులు వంశీకృష్ణ, శ్రీహర్ష, నీలకంఠ, చిరంజీవి మహేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.