ఇరడపల్లి పంచాయితీలో జనసేన నాయకుల సమావేశం

పాడేరు: ఇరడపల్లి పంచాయితీ పరిధిలో బొడ్డపుట్టు దిగువ వీధిలో స్థానిక గ్రామస్తుల పిలుపు మేరకు జనసేన నాయకులు హాజరై వారితో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ చూడండి మా పరిస్థితి కేవలం 2 కిలోమీటర్లు దూరం రోడ్డు వేయడానికి ప్రభుత్వ అధికారులుకి కలెక్టర్ గారికి కూడా వినతిపత్రాలు సమర్పించాం కానీ ఫలితం లేదు ఎన్నో సార్లు స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారికి కూడా తెలియజేసాం, ఎంపీ మాధవి గారు కూడ వచ్చారు మాకు ఇప్పుడు తెలిసింది. వారు కేవలం మా ఓటుకు వచ్చారు కానీ మాకు అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో రాలేదని మా సమస్యలపై చిత్తశుద్ది లేదని అర్ధమవుతోంది. పాఠశాలకు వెళ్ళడానికి విద్యార్థులు వాగు దాటాల్సి వస్తుంది వర్ష కాలంలో రాకపోకలకు వాగు ఉధృతంగా ఉంటే రాకపోకలు స్తంభించి పోతుంది ఎవరికి చెప్పిన ఎన్ని సార్లు మొత్తుకున్నా ఫలితం కనిపించట్లేదని వాపోయారు. మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గిరిజనులను ఉచిత పథకాల పేరుతో మోసం చేస్తోందని కేవలం డబ్బు రూపేణా నగదు ఇస్తున్నారు కానీ ఒక వైపు గిరిజన హక్కులు, చట్టాలు, నిర్వీర్యం చేస్తూ మనల్ని మభ్యపెడుతుందని ఈ విషయాన్ని గిరిజనులుగా మన గుర్తించలేకుంటే మన నాశనం మనతోనే వైసీపీ ప్రభుత్వం తెలివిగా చేస్తోందని అన్నారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల రక్షణకోరకు ఏ చర్యలు తీసుకున్నట్లు లేదని వైకాపా హయాంలో జరుగుతున్న మోసాలు అమాయకులు ఇప్పటికి గుర్తించలేకపోతున్నారని చట్టాలు, రద్దు చేస్తూ, గిరిజన హక్కులు కాల రాస్తూ ఇప్పుడు గిరిజనుల బ్రతుకులని నాశనం చేసేపనిలో పడ్డారన్నారు. జనసేనపార్టీ తరుపున ఇలాంటి కుట్రలను తిప్పికొడతామని ప్రశ్నించు ఫలితం సాధించు గిరిజన రక్షణ కాంక్షించు అనే ఆలోచన చేయు అనే విధానంతో ముందుకు సాగుతున్నామన్నారు. అలాగే జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానంతోనే గిరిజన హక్కులు కాపాడుకోగలమని, ఈ విషయం రాష్ట్రమంతా చదువుకున్న యువతకు తెలుసని అన్నారు. వైకాపా ప్రభుత్వ మోసపు, గిరిజన వ్యతిరేక విధానాలు యువతకు బాగా తెలుసని వైకాపా కేవలం ప్రజాపాలన పేరుతో దోచుకోవడానికి స్థాపించిన ప్రభుత్వమన్నారు. ఉచితలు అందుకునే అమయకులకి ఈ విషయాలు అర్థం కావని కానీ యువతకి తెలుసని అన్నారు. మీరేమో జగనన్న అంటూ ఓటు వేసి గెలిపించుకున్నారు మరీ అతనేమో మీ బిడ్డలకు సంవత్సరానికి ఒక డిఎస్సి అన్నారు కానీ ఏమీ లేదని నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిన ప్రభుత్వమన్నారు. మీకు తెలియకుండానే మీ బిడ్డల భవిష్యత్ మీరే తప్పుదోవ పట్టించారని ఒకరకంగా చెప్పాలంటే మీ బిడ్డల జీవితాన్ని మీరే నాశనం చేసారని కానీ ఈ విషయం మీకు అర్థం కాదన్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా పారదర్శక ప్రభుత్వ విధానానమనే కొత్త రాజకీయాలతో రాజకీయ ప్రక్షాళన జరుగుతుందని కచ్చితంగా జనసేన పార్టీ అధికారం సాధిస్తుంది. మార్పుకోరకు కచ్చితంగా శ్రమించి సాధిస్తామని మాకు గ్రామలకు గ్రామలే సహకారం చేస్తూ జనసేనపార్టీలో చేరుతున్నారన్నారు. ఈ సమావేశంలో పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, కిల్లో రాజన్, సాలేబు అశోక్ గ్రామస్తులు పాల్గొన్నారు.