లేక్ వ్యూ కాలనీలో అక్రమ నిర్మాణాలను తొలగించండి!

  • లేక్ వ్యూ కాలనీలో చెరువును ఆక్రమిస్తూ కడుతున్న కట్టడాలను నిలిపివేయండి, అక్రమ చొరబాటు ధారులను ఖాలీ చేయించాలి
  • కనిగిరి రిజర్వాయర్ అక్రమ గ్రావెల్ తవ్వకాలపై లోకాయుక్త విచారణలో ఏమి తేలింది…ఇప్పటికీ జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోండ

మల్దేవ్ కాలనీ మిగిలిన పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ నిధులు విడుదల చేయండి, లేకుంటే ఇప్పటివరకు చేసిన పనులు విలువ లేకుండా పోతాయి అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ.. స్థలం కొనక్కర్లేదు వైసీపీ నాయకులను మేనేజ్ చేస్తే చాలు. స్థలం పెద్ద వ్యయమేమీ కాదు, రిజిస్ట్రేషన్ ఖర్చు అసలే లేదు, ఇల్లు కట్టుకోగలిగితే చాలు. గమనిక : చెరువుని ఆనుకొని గట్టుమీద కడుతున్నారు.. కాబట్టి వరదలు వస్తే మునిగిపోవచ్చు మీ నష్టాన్ని మీరే భరించుకోగలరు. నెల్లూరు చెరువు కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్న ఆక్రమణదారులు చోధ్యం చూస్తున్న అధికారులు. నెల్లూరు రూరల్ లేక్ వ్యూ కాలనీలో మూడు సంవత్సరాలుగా చెరువును ఆక్రమిస్తూ అనేక కట్టడాలను నిర్మిస్తున్నారు. చెరువు చుట్టూ ఒక పెద్ద ట్రక్కు తిరగల స్థలం వదులి ఉండాల్సింది పోయి…చెరువు అంచున మొదట చెత్త చెదారవేయడం తర్వాత మట్టి వేయడం చదును చేయడం, తర్వాత దాన్ని వైసిపి పెత్తందారులు 50 వేలకు 60 వేలకు వేరే వాళ్లకు అప్పగించడం, వారు అక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టడం పరిపాటిగా మారింది. చెరువు ఆక్రమణలకు గురి అవుతున్నా అధికారుల్లో చలనం లేదు, వైసిపి నాయకుల సూచనలతో నడుస్తున్నారు అనిపిస్తుంది. వరదలు వస్తే లేక్ వ్యూ కాలనీ సందులు సగానికి మునిగిపోయే పరిస్థితి ఉండగా చెరువుని ఆనుకొని అక్రమంగా నిర్మిస్తున్న ఇల్లు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది. పేదలకు ఇచ్చే ఆరంకణాల స్థలం విషయంలో ఆచితూచి ఆరవైఆరు నిబంధనల తో వ్యవహరిస్తున్న ప్రభుత్వ యంతాంగం ఈ ఆక్రము దారుల్లో చొరబాటును ఏ విధంగా నియంత్రించక లేక పోతుంది. ఎవరైనా దీనిమీద ప్రశ్నిస్తే స్థానిక వైసిపి నాయకులు దాడులు దౌర్జన్యాలు.. అందుకనే ఎవరికి వారు పట్టనట్టు చూస్తూ ఊరుకోండి పోయారు. విషయాన్ని ఇరిగేషన్ అధికారులు మరియు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఆక్రమణలు ఆగే వరకు కూడా జనసేన పార్టీ తరఫున పోరాటం చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్, జనసేన నాయకులు శ్రీను, వర్షన్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, మౌనిష్, బన్నీ, వెంకీ, రేవతి తదితరులు పాల్గొన్నారు.