శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం

తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగురు మండలంలో జనసేన కార్యకర్తల సమావేశం ఆదివారం సాయంత్రం తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమంలో పెద్దవడుగురు గ్రామానికి చెందిన 10 మంది, చిన్నవడుగురు గ్రామానికి చెందిన 7 మంది, క్రిష్టిపాడు గ్రామంనకు చెందిన 5 మంది జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎటువంటి సమస్యలు అయినా తన దృష్టికి తీసుకురావాలని త్వరలో పెద్దవడుగురు మండల కమిటీ ఏర్పాటు చేసి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలలో పర్యటించి తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ, సిద్దాంతాలు వివరించి పార్టీనీ బలోపేతం చేస్తూ గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది.

అదేవిధంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే మండల నాయకులు మరియు జనసైనికులు అందరూ సంసిద్ధం కావాలని.. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చిన తనకు తెలియజేయాలని కార్యకర్తలకు ఎల్లపుడూ అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చిన తాను చూసుకుంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.