మార్కాపురం జనసేన కార్యకర్తల సమావేశం

ప్రకాశం జిల్లా, మార్కాపురం, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆధ్వర్యంలో సోమవారం జనసేన కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు, మార్కాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.