పాలకొండ జనసేన నాయకుల సమావేశం

పాలకొండ, గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన 24వ రోజు సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు సమావేశం అయ్యారు. ముందుగా జనసేన జానీ మాట్లాడుతూ ఈ నెల 15, 16, 17 వ తేదీలలో జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా, 15వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఆయన బస చేసే హోటల్ వరకు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికేందుకు జనసైనికులు, క్రియాశీలక సభ్యులు, వీరమహిళలు, తప్పనిసరిగా రావాలని కోరారు. కావున ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి భారీ ఎత్తున జనసందోహంగా విశాఖకు వెళ్లి అధినాయుకుడికి స్వాగతం పలకాలని జిల్లా, రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. జనసైనికులు తప్పకుండా పాల్గొనాలని తెలిపారు. మత్స పుండరీకం మాట్లాడుతూ 16 వ తేది జనవాణి జనసేన కార్యక్రమంలో ప్రజా సమస్యలు, ప్రజలనుంచి వచ్చే వినతులు స్వీకరిస్తారు. అదేరోజు పాలకొండ నియోజకవర్గం సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరు రావాలని కోరారు. 16 వ తేదిన జనవాణి జనసేన అనంతరం సాయంత్రం 6గంటలకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో క్రియాశీలక సభ్యులు కర్ణేన సాయి పవన్, దత్తి గోపాలకృష్ణ, సొండి సుమన్, జరాజపు రాజు, దూసి ప్రణీత్, బొమ్మాలి వినోద్ నాయకులు పాల్గొన్నారు.