ఉత్తరాంధ్ర జనసేన నాయకుల సమావేశం

విశాఖపట్నం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ఈ నెల 15, 16, 17 తేదీలలో ఖరారైన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా కార్యక్రమ నిర్వహణ గురించి ఉత్తరాంధ్ర జనసేన ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మరియు ఉంతరాంధ్ర నియోజకవర్గాల జనసేన పార్టీ ఇంచార్జులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.