జనసేనాని జన్మదిన వారోత్సవాలలో భాగంగా మెగా బైక్ ర్యాలీ
గజపతినగరం నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా గజపతినగరం నియోజకవర్గ నాయకులు మరాపు సురేష్ ఆధ్వర్యంలో 5వ రోజు మెగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. జనసైనికులు నాయకులు ఉత్సాహంతో బైక్ ర్యాలీలో పాల్గొని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని నినాదాలతో ఈ మెగా బైక్ ర్యాలీ విజయవంతంగా జరిగింది. కార్యక్రమంలో నియోజవర్గం నాయకులు, మండల నాయకులు, సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు అడ్డడా మోహన్ రావు, రవి కుమార్ మిడతాన, దుర్గ, పరమేశ్వరి పండు, శ్రీను, మహేష్, ఆదినారాయణ, చరణ్, అనిల్, శంకర్, సూర్య, అనిల్, సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-01-at-3.22.57-PM-1024x507.jpeg)