“మెగా రక్తదాన శిబిరం” విజయవంతం చేయాలి: బాబు పాలూరు

బొబ్బిలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో భాగంగా “మెగా రక్తదాన శిబిరం” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అన్నారు. ఆగస్టు 27 ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మన బొబ్బిలి జనసైనికుల నిలయం (మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా) వద్ద తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు, మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు తెలిపారు. ఈ సందర్బంగా బొబ్బిలిలో ఇలాంటి మంచి సేవా కార్యక్రమంలో అభిమానులు, జనసైనికులు, ప్రజలు భాగస్వామ్యం అవ్వాలని ఆయన కోరడం జరిగింది.