వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

  • డాక్టర్ కందులచే ప్రారంభం
  • రక్తదానం చేసిన 150 మంది వాలంటీర్లు
  • 600 మందికి ఉచితంగా మందులు అందుచేత

వైజాగ్ సౌత్: వాసవి క్లబ్ వి201-ఏ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగరంలోని ఎం.వి.డి.ఎం హై స్కూల్ ప్రాంగణంలో రక్తదాన శిబిరం మరియు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు,
32 వ వార్డు కార్పొరేటర్, వాసవి క్లబ్ వి201-ఏ డిస్ట్రిక్ గవర్నర్ డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో 150 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అదేవిధంగా మెగా వైద్య శిబిరంలో 600 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ వాసవి క్లబ్ సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వశేష స్పందన లభించిందన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారని పేర్కొన్నారు. సుమారు 600 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా మందులను కూడా అందజేయడం జరిగిందని తెలిపారు. 150 మంది స్వచ్ఛంద ముందుకు వచ్చి రక్తదానం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వైద్యులకు అలాగే వాసవి క్లబ్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అనంతరం సేకరించిన రక్తాన్ని రోటరీ క్లబ్ తో లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ కు కూడా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ నిఖిల్, డాక్టర్ సౌరవ్, డాక్టర్ లావణ్య తో పాటు డాక్టర్ కామేష్, వాసవి క్లబ్ క్యాబినెట్ సెక్రటరీ ఎస్.మహేశ్వర రావు, క్యాబినెట్ ట్రెజరర్ ముక్కు శ్రీనివాస్, వైస్ గవర్నర్ వీవీ గుప్తా, 120 సార్లు రక్తదానం చేసిన ప్రోగ్రాం చైర్మన్ వంకాయల జవహర్, మాజేటి పండు, శ్రీనివాస్, దాసు రాజు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.