ఆస్ట్రేలియా జనసేన అధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలు
ఆస్ట్రేలియా, ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి మరియు సెప్టెంబర్ 2వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా ఆస్ట్రేలియా జనసేన శనివారం పలు నగరాలలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన “రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి” అనే నినాదంతో సుమారు 50 మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా జనసేన వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో సందర్భాలలో రక్తం అందక ఎంతో ఇబ్బంది పడేవారని, మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు పిలుపునిచ్చి సొంత ఖర్చులతో బ్లడ్ బ్యాంకు స్థాపించి తద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడి ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో వారి జన్మదిన వేడుకలలో భాగంగా ఆస్ట్రేలియా జనసేన ఆధ్వర్యంలో పలు నగరాలలో శనివారం రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడ్మ జరిగిందని తెలిపారు. ఈ సందర్బహంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు అయినటువంటి జగదీష్ హరిదాసు, రాజేష్ తోట, సుమంత్, అజయ్ బండ్రెడ్డి, శ్రీరాం పెద్దిరెడ్డి మరియు క్రాంతి దిమ్మటిలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-19-at-20.01.37-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-19-at-20.01.34-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-19-at-19.49.42-1-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-19-at-20.01.12-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-19-at-20.01.03-768x1024.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-19-at-20.01.25-768x1024.jpeg)