మోదీకి మెగా బ్రదర్స్ విషెస్

ప్రధాని నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు దేశ, విదేశాల్లోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమదైన శైలిలో మెదీకి విష్ చేశారు.

ట్విట్టర్ వేదికగా.. `మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి 70 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఈ దేశాన్ని మీరు అదే శక్తితో మరెన్నో సంవత్సరాలు పాలించాలని కోరుకుంటున్నా” అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

జనసేన అధినేత `భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు` తెలుపుతూ.. దేశంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారని.. కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని..  అలాంటి వారిలో మోదీ  ప్రథముడు అని కొనియాడుతూ పవన్ ట్వీట్ చేశారు.