మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

  • టోర్నమెంట్ ప్రారంబోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ

రంపచోడవరం: జీడిగుప్ప గ్రామ పంచాయితీ పరిదిలోని రాయిగుడెం గ్రామంలో శుక్రవారం మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. జీడిగుప్ప మరియు తుమ్మిలేరు పంచాయితీల పరిధిలో జరిగే ఈ టోర్నమెంట్ ని జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, జీడిగుప్ప పంచాయితీ సర్పంచ్ ముట్ల బాలరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలలో ఎక్కువగా మక్కువ చూపాలని, క్రీడలలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుంజా రమేష్, కదల కొండారెడ్డి(సి.పి.యం), జనసేన యూత్ నాయకులు పెడపెట్ల పవన్ కళ్యాణ్ మరియు క్రీడాకారులు, టోర్నమెంట్ కమిటీ మెంబెర్స్ పాల్గొన్నారు.