మెగా డాటర్ నిహారిక ఎంగేజ్ మెంట్

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి ప్రారంబం కానుంది. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల నిశ్చితార్థం త్వరలో జరుగనుంది. ఇప్పటికే తనకు కాబోయే వరుడు గురించి మెగా డాటర్ అందరికీ పరిచయం చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో మంచి పరిచయాలు ఉన్నాయి. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం కుదిరిందని వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ .. తన సోదరి నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 13న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతన్య, నిహారిక ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. త్వరలోనే మెగా ఫ్యామిలీని ఒకే వేదికపై చూడవచ్చని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

నిహారిక పెళ్లి ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పెళ్లికి ముందే ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు నిహారిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుస్మిత ఒక ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓయ్ దర్శకుడు ఆనంద్ రంగతో ఒక వెబ్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేశారు.