అమ్మతో పాటు అందరం వకీల్ సాబ్ థియేటర్ లో..

పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదల రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మూడేళ్ల విరామం తర్వాత పవన్ వెండితెరపై కనిపించడంతో అటు అభిమానులే కాదు, మెగా కుటుంబ సభ్యులు కూడా థియేటర్ కు వచ్చి మరీ వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తల్లి అంజనా దేవి, సోదరి, వరుణ్ తేజ్, సాయితేజ్, నాగబాబు తదితరులు హైదరాబాదులోని ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్ లో సినిమా చూశారు.

దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమ్మతో పాటు అందరం వకీల్ సాబ్ థియేటర్ లో అంటూ ఓ క్యాప్షన్ జత చేశారు. షో టైమ్ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.