కొత్త లాజిక్ చెప్పిన మెగా మేనల్లుడు!

లాక్‌డౌన్ ఈ సమయం టాలీవుడ్ సెలబ్రిటీల్లో లాక్ మార్పులు తీసుకొచ్చింది. కరోనా కారణంగా పరిస్థితులన్నీ తారుమారైపోతే టాలీవుడ్‌లో మాత్రం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెళ్లి మాటెత్తితే సమాధానం దాటవేస్తూ సంబంధం లేని సమాధం చెప్పే స్టార్స్ అంతా సడన్‌గా పెళ్లికి రెడీ అయిపోయారు. దిల్ రాజు నుంచి మొదలైన ఈ పెళ్లిళ్ల హంగామా కంటిన్యూ అవుతూనే వుంది.

ఇటీవల మెగా డాటర్ నిహారిక వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ తన పెళ్లెప్పుడంటే ప్రతీ సారి కొత్త లాజిక్ తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇంత కాలం నిహారిక పెళ్లి తరువాతే తన పెళ్లంటూ చెప్పుకొచ్చిన సాయిధరమ్‌తేజ్ తాజాగా నిహారిక పెళ్లైపోవడంతో కొత్త లాజిక్ వినిపించి షాకిస్తున్నాడు.

పెళ్లికి ఇంకా ఐదేళ్లు పడుతుందని చెబుతున్న సాయిధరమ్‌తేజ్ తన పెళ్లి శిరీష్ పెళ్లి తరువాతే అని కొత్త మెలిక పెడుతున్నాడు. తన కంటే శిరీష్ పెద్దవాడని, అతని పెళ్లి తరువాతే తాను పెళ్లి చేసుకుంటానని. అయితే ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న హీరోల్లా తాను లవ్ మ్యారేజ్ చేసుకోనని తను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అది పెద్దలు కుదిర్చినదే అవుతుందని చెబుతున్నాడు. పెళ్లి కాకపోవడం వల్లే తాను లాక్ డౌన్ ని ఎంజాయ్ చేశానని పెళ్లైతే ఎంజాయ్ చేసుండే వాడిని కానని చెబుతున్నాడు. ఈ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.