‘సూప‌ర్‌స్టార్’ కు ‘మెగా’ విషెస్…

ఈరోజు ఆగ‌స్ట్ 9 సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన‌రోజు కావడంతో ఆయనకు సినీ సెల‌బ్రిటీలు మరియు అభిమానులు సోష‌ల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ కు ట్విట్ట‌ర్ ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ లో చిరంజీవి ‘‘అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో  మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ  కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను’’ అంటూ తన శుభాకాంక్షలు తెలియచేసారు.