జాతీయ జెండాను ఆవిష్కరించిన మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మన రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ జరుపుకునే ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నాగబాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలో చిరంజీవి బ్లడ్ బ్యాంకు టీం తో పాటు మెగా ఫాన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెగా అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి రక్తదానం చేసిన అభిమానులను చిరంజీవి, రామ్ చరణ్ లు పరామర్శించారు. మెగా అభిమానుల ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

అంతకు ముందు చిరు తన ట్విట్టర్ ద్వారా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకొని మెగా బ్లడ్ బ్రదర్స్ రక్తదానం చేయాలని కోరారు. రక్త దానం చేయండి, ప్రాణ దాతలు కండి అంటూ చిరంజీవి తన వాయిస్ వీడియో ద్వారా సందేశాన్ని అందించారు.