నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్ రీప్లేస్

స్వాతిని డైరెక్షన్ లో అశోక్ సెల్వన్ హీరోగా ఓ తమిళ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హీరోయిన్ గా నిహారికను తొలుత ఎంపిక చేశారు. అయితే, నిహారికకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే ఆమె పెళ్లి కూడా దగ్గర పడడంతో ఈ  చిత్రంలో నటించలేనని చిత్ర నిర్మాతకు నిహారిక తెలిపింది. దీంతో, ఆమె స్థానంలో మేఘా ఆకాశ్ ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సెల్వకుమార్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో కథానాయిక పాత్ర ఎంతో విభిన్నమైనదని చెప్పారు. ఈ పాత్రకు మేఘ సరిగ్గా సరిపోతుందని స్వాతిని చెప్పడంతో కాసేపు ఆలోచించానని… ఆ పాత్రకు ఆమె పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందనిపించిందని తెలిపారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.