మహారాష్ట్రలో అందుబాటులోకి రానున్న మెట్రో సర్వీసులు

ముంబై లో రేపటి నుండీ దశలవారీగా మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచించిన కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ను అనుసరించి, జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గురువారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు గ్రంథాలయాలను సైతం తిరిగి తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది. అలాగే కంటైన్‌మెంట్‌ జోన్ల వెలుపల జంతువులతో సహా స్థానిక వారపు బజార్లు కూడా ప్రారంభంకానున్నాయి. రద్దీని తగ్గించే లక్ష్యంతో రేపు నుంచి రాత్రి 9 గంటల వరకు మార్కెట్లు, దుకాణాలు రెండు గంటల పాటు అదనంగా తెరిచే ఉండనున్నాయి. అలాగే విమానాశ్రయాలలో దేశీయ ప్రయాణికులకు కరోనా పరీక్షల తర్వాత చెరగని సిరాతో స్టాంపింగ్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల ఆరోగ్య పరీక్ష, స్టాంపింగ్ నిలిపివేయనున్నారు.